Monday, April 29, 2024

సమంత ‘శాకుంతలం’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్..

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజుతో కలిసి గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇవ్వాల (ఏప్రిల్ 14న) రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. బోరింగ్ సన్నివేశాలు, కార్టూన్ సినిమాలను తలపించిన విఎఫెక్స్.. అర్థం కాని సంభాషణలు కలగలిపి ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చేలా చేశాయని చెప్పొచ్చు.

ఇక ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్న విశయం ఒక్కటే? ‘‘శాకుంతలం’’ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అని చర్చ నడుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘శాకుంతలం’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. సమంత, దిల్ రాజుల కారణంగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ రేటుకే అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ‘శాకుంతలం’ రిలీజ్ అయిన 4 వారాల తర్వాత అంటే మే మొదటి వారంలో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుందని స్పష్టమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement