Sunday, April 28, 2024

Saindhav Team – ఉద‌యాన్నే దుర్గ‌మ్మ సేవ‌… ఆ త‌ర్వాత బాబాయ్ హోట‌ల్లో బ్రేక్ ఫాస్ట్

విజయవాడలోనీ ఎందుకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మని సైంధ‌వ్ హీరో, విక్టరీ వెంకటేష్ ద‌ర్శించుకున్నారు.. అమ్మవారి దర్శనానికి ఆలయానికి వ‌చ్చిన హీరోకి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కర్నాటి రాంబాబు, ఏఈఓ రమేష్ లు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంత‌రం అమ్మవారిని ఆయ‌న ద‌ర్శించుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు ఆశీర్వచం మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం చేయగా చైర్మన్ కర్నాటి రాంబాబు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు

బాబాయ్ హోటల్ లో సందడి

సైంధవ్ మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చిన సినిమా యూనిట్ సభ్యులు నగరంలోని బాబాయి హోటల్ సందర్శించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం టిఫిన్ చేసేందుకు బాబాయ్ హోటల్ కు వెంకటేష్ చిత్ర బృందం విచ్చేశారు. హోటల్లో అల్పాహారాన్ని స్వికరించారు. వెంకటేష్ తో సెల్ఫీ లు దిగేందుకు అభిమానులు స్థానికులు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement