Monday, April 29, 2024

బ్లాక్ మార్కెట్ పై కేటీఆర్ కు ‘ఆర్ఆర్ఆర్’ ట్వీట్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువ అవుతుంది. ప్రతిరోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా తో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆక్సిజన్, ఇంజెక్షన్లు లేక ఆపసోపాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారికి సినీ స్టార్స్ కొంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే వెంటనే స్పందిస్తున్నారు.

మరోవైపు ఆక్సిజన్, రేమిడిసివర్ ఇంజక్షన్ లకు బయట ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని వాటిని బ్లాక్ మార్కెట్లో చాలావరకు అమ్మేస్తున్నారు. అధిక ధరలకు అమ్ముకుంటూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారు. ఇక ఇదే విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్ళింది. కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement