Sunday, October 6, 2024

‘RRR’ వాయిదాకు అదే కారణమా?

తెలుగు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్.. మ‌న్నెందొర అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు రిలీజ్ వాయిదా పడిన RRR.. తాజాగా మరోసారి వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది.

తొలుత ద‌స‌రా పండగ సందర్భంగా అక్టోబర్ లో విడుద‌ల అవుతుందనుకున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిందని ఫిల్మ్ నగర్ టాక్. సినిమాలోని కొన్ని సీన్స్ ని దర్శకుడు రాజమౌళి మరోసారి రీషూట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సినిమాలో ఎన్టీఆర్‌, బ్రిటీష్ బ్యూటీ ఒలివియా మోరిస్ మ‌ధ్య నడిచే లవ్ ట్రాక్ రాజ‌మౌళికి న‌చ్చ‌లేదట. దాంతో ఆ పార్ట్‌ను రీషూట్ చేస్తున్నాడ‌ని, అందుకే మూవీ రిలీజ్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే, దీనిపై మూవీ టీమ్ మాత్రం రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement