Wednesday, February 8, 2023

అయ్యన్నకు అన్నీ పీకేశారుః ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్య

సీఎం జగన్ పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. అయ్యన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. మాజీ స్పీకర్ కోడెలకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా.. మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమయ్యారని రోజా ప్రశ్నించారు. అయ్యన్నకు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి పీకేశారని తెలిపారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి పీకేశారని విమర్శించారు. అడ్డదారిన మంత్రి అయిన లోకేశ్ పదవిని ప్రజలు పీకేశారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా ఎలా వుండాలో జగన్‌ని చూసి నేర్చుకోవాలని రోజా హితవు పలికారు.

ఇది కూడా చదవండిః ఏపీలో చంద్రబాబుకే రక్షణ కరువైందిః మాజీ మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement