Saturday, May 4, 2024

RGV – ప‌వ‌న్ త‌న‌కు తానే వెన్నుపోటు పొడుచుకుంటాడు …..’వ్యూహం’ టీజ‌ర్ 2 రిలీజ్

YouTube video

సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఎలక్షన్స్ టైంకి వ్యూహం అనే పొలిటికల్ సినిమాతో రాబోతున్నాడు. ఎపి ముఖ్య‌మంత్రి జగన్ కి సంబంధించిన కథతో వ్యూహం అనే సినిమాను రెండు పార్టులుగా తెస్తున్నాడు. మొదటి పార్ట్ ఈ సంవత్సరం, రెండవ పార్ట్ ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తానని ప్రకటించారు ఆర్జీవీ. రాజశేఖర్ రెడ్డి చనిపోయాక జగన్పై జరిగిన కుట్రలు, జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది వ్యూహం మొదటి పార్ట్ లో చూపించనున్నారు. ఇప్పటికే వ్యూహం నుంచి ఒక టీజర్ విడుదల చేయగా తాజాగా వ్యూహం సినిమా నుంచి మరో టీజర్ ని విడుదల చేశారు ఆర్జీవీ.


ఇక ఈ టీజర్ లో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత పరిస్థితులు చూపించారు. ఇక ఇందులో జగన్, జగన్ కుటుంబ పాత్రలతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్, సోనియా గాంధీ, రోశయ్య, మన్మోహన్ సింగ్.. ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు ఆర్జీవీ. టీజర్ చివర్లో ఏదో ఒక రోజు కళ్యాణ్ ను కూడా వెన్ను పోటు పొడుస్తారు కదా అని చంద్రబాబుని అడగ్గా వాడికి అంత సీన్ లేదు వాడిని వాడే వెన్ను పోటు పొడుచుకుంటాడు అనే డైలాగ్ పేలింది… రాజ‌కీయ కోణంలో విడుద‌ల చేసిన ఈ టీజ‌ర్ లో రామ్ గోపాల్ వ‌ర్మ మార్క్ క‌నిపించింది..
Advertisement

తాజా వార్తలు

Advertisement