Saturday, May 4, 2024

అంటే సుంద‌రానికి.. నాని మూవీ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్‌

నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ ‘అంటే .. సుందరానికీ’ సినిమాను రూపొందించారు. ఈ మూవీతో మలయాళ బ్యూటీ నజ్రియా తెలుగుతెరకి పరిచయం కానుంది. వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇదివ‌ర‌కే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజ‌ర్, పోస్టర్స్, సాంగ్స్ కి ప్రేక్ష‌కుల‌నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది..

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. భరద్వాజ్ పాత్రుడు రాసిన ఈ పాటను కారుణ్య ఆలపించాడు. నానీకి ఎదురయ్యే పరిస్థితులను .. అనుభవాలను ఆవిష్కరించేదిగా ఈ పాట ఉంటుంది. కథకి తగినట్టుగానే పాటకి కూడా కాస్త కామెడీ టచ్ ఇచ్చారు. కాగా. జూన్ 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement