Saturday, April 20, 2024

రణస్థలి చిత్రం-2 లుక్‌.. పోస్టర్‌ ఆవిష్కరణ

అమరావతి, ఆంధ్రప్రభ: అనుపమ జ్యోతి ప్రొడక్షన్స్‌ ఆధ్వర్యంలో సూరెడ్డి విష్ణు సమర్పణలో పరశురాం శ్రీనివాస్‌ రచన.. దర్శకత్వంలో నిర్మించిన రణస్థలి చిత్రము 2 లుక్‌ పోస్టర్‌ను సినీ రచయిత, దర్శకులు విజయేంద్రప్రసాద్‌ ఆవిష్కరించారు. బుధవారం తన కార్యాలయంలో విజయేంద్రప్రసాద్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. రఫ్‌ కట్‌ టీ-జర్‌ చూసిన ఆయన మేకింగ్‌ చాలా బాగుందని డైరెక్టర్‌ పరశురాం శ్రీనివాస్‌ను ప్రశంసించారు.

ఈ కార్యక్రమములో దర్శకులు పరశురాం శ్రీనివాస్‌, కెమెరామెన్‌ జాష్టి బాలాజీ, నటులు శివ,నాగేంద్ర,శ్రీనివాస్‌ వెట్టి మరియు కెమెరా అసిస్టెంట్‌ సాయి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మూర్తి పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement