Thursday, April 25, 2024

రామ్ – బోయపాటిల మూవీ ఫ‌స్ట్ లుక్ అదుర్స్..

బోయపాటి శ్రీను, రామ్‌ పోతినేని కాంబినేషన్‌ చిత్రం చిత్రీకరణలో ఉంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా ఇదే ఏడాది అక్టోబర్‌ 20న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేశారు. రామ్‌ తన చేతిలో గంగిరెద్దుని లాగుతూ కనిపిస్తున్నారు. డెనిమ్స్‌ షర్టు, జీన్స్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నా. అతడి ముఖ్యంలో మాత్రం తీక్షణత కనిపిస్తోంది. బోయపాటి రూపకల్పన చేసిన మాస్‌ పాత్ర ఇదని స్పష్టమవుతోంది. రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. థమన్‌ సంగీతం, తమ్మిరాజు ఎడిటింగ్‌, సంతోష్‌ కెమెరామెన్‌గా బాధ్యతలు నెరవేరుస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement