Monday, April 29, 2024

మీనా కూతురి స్పీచ్ కి.. క‌న్నీళ్లు పెట్టుకున్న ర‌జ‌నీకాంత్

రీసెంట్ గా భ‌ర్త‌ని కొల్పోయింది సీనియ‌ర్ న‌టి మీనా. కాగా మీనా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా చెన్నైలో మీనాకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ తారలంతా హాజరయ్యారు. మీనాని ఘనంగా సన్మానించారు. ఆ కార్యక్రమంలో సడెన్​గా మీనా కూతురు వీడియో ఒకటి పోస్టు చేశారు. ఆ వీడియో చూసిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో పాటు అక్కడున్న తారలంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అమ్మా.. నువ్వు ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నా.

ఒక నటిగా నువ్వు కష్టపడుతూనే ఉంటావు. ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు. నా చిన్నప్పుడు ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లాం. మీతో చెప్పకుండా ఇంకో షాప్‌కు వెళ్లిపోయి చాక్లెట్స్‌ తింటూ కూర్చున్నా. ఆరోజు నువ్వు ఎంత టెన్షన్ పడ్డారో నాకిప్పుడు అర్థమవుతోంది. అందుకు నన్ను క్షమించు. నాన్న చనిపోయాక డిప్రెషన్‌కు గురయ్యావు. నువ్వు మానసికంగా దెబ్బతిన్నావు. ఇక నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటా. ఇటీవలే న్యూస్ ఛానెల్స్‌లో నీ గురించి ఫేక్ వార్తలు రాస్తున్నారు. మా అమ్మ కూడా మనిషే కదా. ఆమెకు ఫీలింగ్స్ ఉంటాయి. దయచేసి ఇలాంటి వార్తలు రాయొద్ద‌ని నైనికా కోరింది.ఇప్పుడీ వీడియో వైర‌ల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement