Wednesday, May 1, 2024

ర‌జినీకాంత్ కొత్త లుక్‌……

రజిని కాంత్‌ కొత్త లుక్‌ విడుదలైం ది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం లాల్‌ సలామ్‌. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. రజినికాంత్‌ తనయ ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కీలక పాత్రను పోషిస్తున్నారనే సంగతి తెలిసిందే. సోమవారం నాడు రజినీకాంత్‌ లాల్‌ సలాం చిత్రంలో పోషిస్తోన్న మొయిద్దీన్‌ భాయ్‌ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. లుక్‌ను గమనిస్తే ముస్లిం గెటప్‌లో రజినీకాంత్‌ రాయల్‌గా నడిచివస్తున్నారు. బాషాలో మాణిక్‌ బాషాగా అలరించిన రజిని ఇప్పుడు లాల్‌ సలాంలో మొయిద్దీన్‌ భాయ్‌గా మెప్పించబోతున్నారు. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ ” లాల్‌ సలాం ఐశ్వర్య రజినీకాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌గారు మొయిద్దీన్‌ భాయ్‌ అనే పవర్‌ఫుల్‌ రోల్‌లో కనిపించ బోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేయటం చాలా హ్యాపీగా ఉంటు-ంది. ఆయన తనదైన ్టసల్‌లో రాకింగ్‌ పెర్ఫామెన్స్‌తో ఈ చిత్రంలోనూ ఆడియెన్స్‌ను ఆకట్టు-కుంటారనటంలో సందేహం లేదు. . ఈ చిత్రానికి ఎ.ఆర్‌ .రెహమాన్‌ సంగీతాన్ని , విష్ణు రామస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారని ” తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement