Wednesday, May 1, 2024

శివ లాగా క‌స్ట‌డీ గుర్తుండిపోతుంది…

అక్కినేని నాగ చైతన్య, వెంకట్‌ ప్రభుల ద్విభాషా చిత్రం ‘కస్టడీ.’ కృతి శెట్టి కథానా యిక. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేప థ్యంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి కస్టడీ విశేషాలని పంచుకున్నారు.
మీెరు బ్యాక్‌ టు బ్యాక్‌ ఇద్దరు తమిళ దర్శ కులని ఇక్కడికి తీసుకొచ్చారు?
మన దర్శకులు కూడా బాగా బిజీగా ఉన్నారు కదా. అందరికి రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ‘గ్యాంబ్లర్‌’ సినిమా నుంచి వెంకట్‌ ప్రభుతో సినిమా చేయాలని అనుకున్నాను. తన స్క్రన్‌ ప్లే, ఆలోచించే విధా నం నాకు చాలా ఇష్టం.
ఒక నిర్మాతగా మీకు ఆకర్షించిన అంశాలు ?
కథ, మంచి స్క్రన్‌ ప్లే. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎమో షన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సీరియస్‌ కథ జరుగుతుంటుం ది. సీరియస్‌లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ వుంటుంది. ఈ రెండిటిని దర్శకుడు మిక్స్‌ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. తెలుగు ఎమోషన్స్‌తో ఒక హాలీవుడ్‌ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.
పోన్‌ ఇండియా ప్లాన్‌ చేయలేదా ?
మొదటి నుంచి ఇది బైలింగ్వెల్‌ చిత్రం అనుకున్నాం. హందీలో తర్వాత వుంటుంది.
రెెండు భాషల్లో వేరువేరు నటులు కనిపిస్తారా ?
తెలుగు లో వెన్నెల కిషోర్‌ గారు వున్నారు. ఆ పాత్రని తమిళ్‌లో ప్రేమ్‌ జీ చేశారు. ఆ ఒక్క పాత్రలో మార్పు వుంటుంది.
కెస్టడీ కథలో పోలీస్‌ వ్యవస్థ గురించి ఉంటుందా ?
ఇది నిజాయితీ గల ఒక కానిస్టేబుల్‌ కథ. రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ లోని ఒక కానిస్టేబుల్‌ కథ. యాక్షన్‌ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉంటాయి.

ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ని పెట్టడానికి కారణం ?
ఇది 90లో జరిగే కథ. ఇలాంటి సినిమాకి నేపధ్యం సంగీతం ఇళయరాజా గారు వుంటే బావుంటుందని ఆయన్ని తీసుకోవడం జరిగింది. కథ వినగానే ఇళయరాజా గారు, యువన్‌ మేము చేస్తామని ముందుకు రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
హరోని బట్టి బడ్జెట్‌ లెక్కలు వేసుకుంటారా ? కథకు ఖర్చు చేస్తారా ?
యూటర్న్‌ తీసేనాటికి సమంత గారి మార్కెట్‌ ఏమిటో ఎవరికీ తెలీదు. కథ నచ్చి చేశాను. కథకు కావాల్సింది ఖర్చు పెట్టాను. అలాగే గోపిచంద్‌ సిటిమార్‌, రామ్‌ వారియర్‌ వారి కెరీర్‌ లోనే #హ యెస్ట్‌ బడ్జెట్‌ సినిమాలు. కథ నచ్చే చేశాను. కస్టడీ కూడా నాగ చైతన్య కెరీర్‌ లో #హయెస్ట్‌ బడ్జెట్‌ మూవీ.
మీె సినిమాలకి ఇంగ్లీష్‌ పేర్లు పెట్టడా నికి కారణం ?
ప్రత్యేకంగా అలా ఏమీ లేదండీ. కథకు తగ్గట్టుగా కుదిరాయి. ఈసారి మాత్రం చక్కని తెలుగు టైటిల్‌తో వస్తున్నాం.
కృతిశెట్టిని మరోసారి హరోయిన్‌ గా ఎంపిక చేయడానికి కారణం?
కృతిశెట్టి మంచి ఆర్టిస్ట్‌. లీడింగ్ హరోయిన్‌. యూత్‌ అం దరికీ ఇష్టమైన #హరోయిన్‌. చాలా మంచి నటన కనబ రుస్తుంది.
దెర్శకుడు ఈ చిత్రానికి శివ అనే పేరు పెడతామని అను కున్నారట ?
నాకు అదే యాప్ట్‌ టైటిల్‌ అనిపించింది. కానీ చైతు గారు పోలికలు వస్తాయి వద్దు అన్నారు.
క‌స్టడీలో కామెడీ ట్రాక్‌ ఉంటుందా ?
ఇందులో ట్రాకులు వుండవు. ఒక సీన్‌కి వచ్చి వెళ్ళిపో యే పాత్ర వుండదు, అలాగే పాటల్లో కనిపించి వెళ్ళిపోయే హరోయిన్‌ వుండదు. మొదటి సీన్‌ నుంచి చివరి దాక ఒక ఇంటర్‌ లింక్‌ వుంటుంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుంటుంది.
కెస్టడీ అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ గురించి చెప్పండి ?
తెలుగు స్క్రన్‌ మీద ఇలాంటి అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చూసి వుండరు. హలీవుడు స్టైల్‌ లో మన ఎమోషన్స్‌ తో చాలా ఎక్స్‌ టార్డినరి గా వుంటుంది. దాదాపు ఇరవై రోజు ఈ సీక్వెన్స్‌ చేశాం. డైలీ రెండు కాల్షిdట్లు పైనే అయ్యేది. మైసూర్‌, రాజమండ్రి ప్రాంతాల్లో షూట్‌ చేశాం. అలాగే దిని కోసం స్పెషల్‌ గా సెట్‌ కూడా వేశాం. ఇందులో నాలుగు యాక్షన్‌ సీక్వెన్స్‌ లు అద్భుతంగా ఉంటాయి.
నాగార్జున గారి సినిమా గురించి ?
జూన్‌ నుంచి షూటింగ్‌ వుంటుంది. పూర్తి వివరాలు త్వరలో చెబుతాం. అలాగే నాగచైతన్య తో మరో సినిమా చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement