Thursday, April 25, 2024

ఇక్కడ లోకల్ !! నాన్ లోకల్ లేదు!! బండ్ల గణేష్ ఫైర్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ తో మీడియా ముందుకు వచ్చారు. అయితే ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ తో తనకు ఇరవై మూడేళ్లుగా పరిచయం ఉందని కొన్ని వందలసార్లు ప్రకాష్ రాజ్ ని తిట్టుకున్నానని అలాగే లక్షల సార్లు ప్రేమించానని లోపలి నుంచి చూస్తే ప్రకాష్ రాజ్ చాలా అద్భుతంగా కనిపిస్తారని అన్నారు. కరోనా సమయంలో కొన్ని వందల మందిని తన ఫాంహౌస్లో పెట్టుకుని ఉచితంగా భోజనం పెట్టి సహాయం చేసిన వ్యక్తి ప్రకాష్ రాజ్ అని అన్నారు. అలాగే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని అంటున్నారు… మా లో కుల, మత, వర్గ విభేదాలు లేవు. ఇది మా ‘మా’ అన్నారు.

ఇప్పటివరకు మా అధ్యక్షులుగా పనిచేసిన ప్రతి వారు ఎవరి స్థాయిలో వారు బాగా పని చేశారు. ఎవ్వరూ చేయలేదు అని నేను అనలేదు. ఇక్కడ పుట్టిన ప్రభాస్ ఇండియానే ఏలుతున్నాడు. ఇక్కడ పుట్టిన రాజమౌళి వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. మనమంతా గర్వపడాలి. ప్రకాష్ రాజ్ కచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తాడని నమ్మకంతో ఆయన వెంట నడుస్తున్నాను. దయచేసి ఎన్నికల వరకు కూడా మీడియా వాళ్లు కూడా మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవద్దని కోరుతున్నాను. మా వెనుక చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తామని నా పూర్తి మద్దతు ప్రకాష్ రాజ్ కు ఇస్తున్న అని చెప్పుకొచ్చారు బండ్ల.

Advertisement

తాజా వార్తలు

Advertisement