Thursday, April 25, 2024

విమాన ప్రయాణికులకు ‘స్పైస్ జెట్’ శుభవార్త

విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ శుభవార్తను అందించింది. బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్ సేల్‌ను ప్రారంభించింది. దీని కింద వివిధ దేశీయ గమ్యస్థానాలకు రూ.999 నుంచి విమాన ప్రయాణ సేవలు అందించనుంది. విమానయాన సంస్థ ఉచిత విమాన వోచర్లను అందిస్తోంది. స్పైస్ జెట్ వెబ్ సైట్ లో ప్రత్యక్ష టికెట్ల బుకింగ్ లో కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. జూన్ 25 నుంచి ప్రయాణికులకు ఆఫర్లు లభిస్తాయి. జులై 1 నుంచి 31 వరకు, ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వతేదీల మధ్య ప్రయాణానికి ఉచిత వోచర్ల బుకింగ్ చెల్లుబాటు అవుతుంది. ఈ ఆఫర్ వన్ వే రిటైల్ చార్జీలపై ఉంటుంది. దేశీయ విమాన సర్వీసులపై రాయితీలు ఉంటాయని స్పైస్ జెట్ తెలిపింది.

ఇది కూడా చదవండి: విండోస్ 11ను ఆవిష్కరించిన మైక్రోసాఫ్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement