Friday, March 29, 2024

పవన్ తో ప్రియమణి కూడా!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ , హరీష్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సినిమాపై అంచనాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి. అయితే ఈ సినిమాకు సంచారి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు ప్రియమణి కూడా నటించనుందట. కాగా దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి దీనిపై చిత్రబృందం ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement