Friday, March 29, 2024

హైకోర్టులో జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ

ఎయిడెడ్ కళాశాలల విషయంలో జగన్‌ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. కళాశాలల్లో అడ్మిషన్లను కొనసాగించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఎయిడెడ్ కళాశాలలకు అడ్మిషన్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనంపై హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. పిటిషనర్ల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

ఎయిడెడ్ కళాశాలల్లో అడ్మిషన్లను ఆపివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన న్యాయవాది శ్రీనివాస్… తాము అటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చారని చదివి వినిపించిన న్యాయవాది శ్రీనివాస్… అడ్మిషన్లు జరగక పోతే లక్షలాది మంది విద్యార్దులు నష్టపోతారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అడ్మిషన్లు నిర్వహించుకోవచ్చని యాజమాన్యాలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల స్వాధీనం నోటిఫికేషన్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో సాధారణ కూలీ కుటుంబానికి రూ.1.48 లక్షల కరెంట్ బిల్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement