Friday, May 17, 2024

ప్ర‌ణీత‌కు పాప పుట్టింది.. ఫొటోతో సంతోషాన్ని షేర్ చేసుకున్న న‌టి

అందాల నటి ప్రణీత సుభాష్‌ పండంటి పాప‌కి జన్మనిచ్చింది. తమ జీవితంలోకి ముద్దుల పాపాయి అడుగుపెట్టిందని సోషల్ మీడియా ద్వారా ప్ర‌ణీత‌ వెల్లడించింది. కొన్నిరోజులుగా నమ్మశక్యం కాని రీతిలో కాలం గడిచిపోయిందని, త‌న మాతృత్వపు సంతోషాన్ని సోష‌ల్ మీడియా అభిమానుల‌తో పంచుకుంది. ఈ మేరకు తన పేగుతెంచుకు పుట్టిన బిడ్డను చేతుల్లో పొదివిపట్టుకున్న ఫొటోను కూడా ట్వీట్ చేసింది. ప్రణీత గతేడాది మే నెలలోనే వివాహం చేసుకుంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఈ బ్యూటీకి పరిణయం జరిగింది. కాగా, పాప ఎంతో బాగుంద‌ని చాలామంది త‌మ అభిమానాన్ని చాటుకుంటూ సంతోషంగా కామెంట్స్ పెడుతున్నారు. ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement