Saturday, May 4, 2024

Salar: ప్ర‌భాస్ అభిమానుల‌కు నిజంగా షాకే….

రిలీజ్‌కు ముందు దాదాపు ప్రతి సినిమా బృందం పలు విధాలుగా ప్రచారం కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. వ్యక్తిగత ఇంటర్య్వూలతో పాటుగా ఈ వెంట్స్‌ నిర్వహిస్తుంటారు. పాన్‌ ఇండియా సినిమాలకైతే వివిధ రాష్ట్రాల్లో చిత్ర బృందం పర్యటిస్తుంది. ప్రీ రిలీజ్‌ వేడుకలు నిర్వహిస్తుంది.

దీనివల్ల సినిమాలకు భారీ ఓపనింగ్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీనికి భిన్నంగా ప్రభాస్‌ నటిస్తున్న సలార్‌ సినిమా విడుదలవుతుందనే మాట వినిపిస్తోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న సలార్‌ పార్ట్‌ 1 ఇదే నెల 22న ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. మరో ట్రైలర్‌ కూడా వస్తోందని అంటున్నారు. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంకు ప్రభాస్‌ ఎలాంటి ప్రచారం చేయరనే మాట వినిపిస్తోంది. . సలార్‌లో శృతిహాసన్‌ కథానాయికగా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement