Friday, October 4, 2024

SKLM: కారు బోల్తా.. ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. సోంపేట మండలంలో బారువ సోంపేట మధ్యలో ఖంబ ప్రాంతంలో కారు బోల్తా కొట్టి పొలాల్లోకి దోచుకుపోవడంతో గొల్లవూరు సచివాలయం చెందిన మృత్యుంజయం(34) అక్కడికక్కడే మృతి చెందినట్లు బారువ సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి తెలిపారు.

అదే కారులో ఉన్న మందస మండలం సిద్దిపేట గ్రామానికి చెందిన సాయి కుమార్ అనే యువకుడికి వెన్నుపూస విరిగి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈ సంఘటనపై బారువ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement