Monday, April 29, 2024

ప్ర‌భాస్ పుట్టిన‌రోజున అభిమానుల‌కు అదిరిపోయే గిఫ్ట్ !

ప్రభాస్‌ నటిస్తున్న ఆదిపురుష్‌ త్రీడీ టీజర్‌ అభిమానులకు సంతృప్తిని కలిగిం చింది. థియేటర్లలో ప్రదర్శించిన ఈ టీజర్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించి తీయడంతో ఆకట్టుకుంది. సం క్రాంతికి ఆదిపురుష్‌ ప్రేక్షకులను అలరిం చనున్నాడు. ఇకపోతే ఈనెల 23న ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రభాస్‌ నటి స్తున్న మరో చిత్రం సలార్‌ టీజర్‌ గ్లింప్స్‌ విడుదలవుతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కేజీఎఫ్‌ సిరీస్‌ తర్వాత ఆయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు అధికంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఈ చిత్రంలో ప్రభాస్‌ తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్‌ నటిస్తుంది. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement