Thursday, May 2, 2024

ధనుష్ తెలుగు సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ?

తమిళ స్టార్ హీరో ధనుష్ ఒక్క తమిళ్ లోనే కాకుండా హిందీ ,తెలుగు సినిమాలలో కూడా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్ తో సినిమా చేయబోతున్నాడు.

అయితే ఈ సినిమాలో నటించే హీరోయిన్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో ధనుష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement