Thursday, April 25, 2024

పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్‌1 ట్రైల‌ర్ రిలీజ్‌.. గూస్‌బంస్ తెప్పిస్తున్న ట్రైల‌ర్‌!

కల్కి రాసిన క్లాసిక్ తమిళ నవలా ఆధారంగా మణిరత్నం దర్శకత్వంలో రూపొందింది పొన్నియిన్ సెల్వన్ సినిమా. రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ ఈ ఏడాది సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో థియేటర్లలోకి రానుంది. కాగా, ఈ సినిమా ట్రైల‌ర్ ను ఇవ్వాల రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 టీజర్‌ను తెలుగులో సూప‌ర్ స్టార్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు రిలీజ్ చేశారు. ఐశ్వర్యారాయ్‌ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో మళ్లీ నటిస్తోంది. ట్రైల‌ర్ లో ఐశ్వర్య మంత్ర ముగ్ధులను చేసే అవతార్‌లో క‌నిపిస్తోంది..

ఈ సినిమాలో ఆమె నందిని పాత్రలో నటిస్తుండ‌గా.. త్రిష కుందవాయిగా న‌టిస్తోంది. వందీయతేవన్‌గా కార్తీ ఉత్కంఠభరితంగా కనిపిస్తాడు. విక్రమ్‌ని మునుపెన్నడూ చూడని అవతార్‌లో ఈ ట్రైల‌ర్ మనం చూడ‌చ్చు.. అద్భుతమైన సెట్‌లు, కొన్ని రియ‌ల్ లొకేషన్‌లతో కూడిన అద్భుతమైన ట్రైల‌ర్ చూస్తుంటే గూస్‌బంప్‌లను రావ‌డం ఖాయం. కార్తీ, చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, విక్రమ్ ప్రభు, జయం రవి, లాల్, జయరామ్, పార్థిబన్, ప్రకాష్ రాజ్ వంటి స్టార్ కాస్టింగ్ ఉంది ఈ సినిమాలో.

మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కాగా, ఈ సినిమా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీతో ఐదు భాషల్లో విడుదల కానుండ‌గా.. దేశవ్యాప్తంగా ప్రేక్ష‌ల మ‌ద్య‌ భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement