Saturday, July 27, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ కి విల‌న్ ఎవ‌రో తెలుసా

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ మేర‌కు ఈ చిత్రంలో విల‌న్ గా హీరో విజ‌య్ సేతుప‌తిని న‌టింప‌చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఈ మేర‌కు ఆయ‌నతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. కాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. ప్రతినాయకుడి పాత్రను హరీశ్ చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేశాడట. ‘మాస్టర్’ .. ‘ఉప్పెన’ సినిమాలతో విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement