Saturday, July 27, 2024

ఉగాది రోజు ‘వకీల్ సాబ్’ అదరగొట్టాడు

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. ఇక ఈ సినిమాలో నివేదాథామస్, అంజలి, అనన్య కీలక పాత్రలలో నటిస్తోంది. ఇక మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత కొన్ని అడ్డంకులు ఎదుర్కొంది. అయినా హిట్ టాక్ రావడంతో పాటు మహిళలకు కనెక్ట్ అవటంతో కలెక్షన్స్ తగ్గలేదు.

ఇక ఉగాది పండుగ రోజు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వకీల్ సాబ్ కలెక్షన్లు కుమ్మేసినట్టు తెలుస్తోంది. డే2,డే 3 స్థాయిలో కలెక్షన్లు సాధించినట్ట తెలుస్తోంది. ఇక మరోవైపు దగ్గరలో సినిమాలేవీ కూడా లేకపోవడంతో వకీల్ సాబ్ మరింత ఎక్కువగా కలెక్షన్లను కొల్లగొట్టే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement