Friday, April 19, 2024

రంజాన్ మాసంలో వ్యాక్సిన్ తీసుకోవచ్చా?

నేటి నుంచి ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలను పాటిస్తారు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకోవడంపై పలువురు ముస్లింలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ప్రముఖ ఇస్లామిక్ సంస్థ దారుల్ ఇఫ్తా ఫరంగి మహల్ ఫత్వాను జారీ చేసింది. ఉపవాస దీక్షపై వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపబోదని ఫత్వాలో తెలిపింది. రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాస దీక్షలు పాటించే ముస్లింలు కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండవద్దని పేర్కొంది. వ్యాక్సిన్ నేరుగా రక్తనాళాల్లో కలుస్తుందని, పొట్టలోకి వెళ్లదు కాబట్టి ఉపవాస దీక్ష భంగం కాదని తెలిపింది.

అటు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. అవసరమైతే మరిన్ని టీకాలకు అత్యవసర వినియోగానికి అనుమతించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలిస్తోంది. భద్రత ఆధారంగా వాటిని అనుమతులు ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement