Wednesday, October 16, 2024

పోలీస్ డ్రెస్ తో సెట్ లో పవర్ స్టార్…ఫోటో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12 గా వస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ కు వాయిదా పడగా… నేడు తాజాగా షూటింగ్ మళ్ళీ మొదలైంది.

పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ భీంలా నాయక్ పాత్ర లో కనిపించనున్నారు. సెట్స్ లో పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో లో పవన్ కళ్యాణ్ వెనక నుంచి పోలీస్ డ్రెస్ లో కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement