Saturday, July 27, 2024

భీమ్లా నాయక్ మేకింగ్ వీడియో@ పవర్ స్టార్

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ సినిమాకు రీమేక్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా నిన్న స్టార్ట్ అయింది.

ఇదే విషయాన్ని చెబుతూ చిత్ర దర్శక నిర్మాతలు పవన్ భీమ్లా నాయక్ అనే పాత్రను పోషిస్తున్నట్లు రివీల్ చేశారు. అలాగే ఒక మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా ఆ మేకింగ్ వీడియో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి మేకింగ్ వీడియో ఏమేర ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement