Friday, April 26, 2024

డబ్బింగ్ పూర్తి చేసిన వకీల్ సాబ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మరోవైపు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ డబ్బింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శృతి హసన్ నటిస్తుండగా.. నివేదాథామస్, అంజలి,అనన్య కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈనెల 29న విడుదల కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement