Thursday, May 2, 2024

పవన్ కళ్యాణ్ తో మామూలుగా ఉండదు…!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలను ప్రకటించి ఫ్యాన్స్ లో మంచి ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. ఇప్పటికే ఓ వకీల్ సాబ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరో వైపు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియం రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే క్రిష్ దర్శకత్వంలో కూడా హరిహర వీరమల్లు గా రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారట. మూడు పాత్రలకు కూడా వేరు వేరు కాస్ట్యూమ్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ నిపుణుల పర్యవేక్షణలో దర్శకుడు క్రిష్ వాటిని డిజైన్ చేయించారట. ఇప్పుడు రిలీజ్ చేసిన లుక్ కాకుండా ఉన్న మరో రెండు లుక్స్ అభిమానులను మరింత రంజింప చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా 2022 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement