Thursday, May 16, 2024

మీ అభిమానం తగలెయ్య… ట్రైలర్ కోసం అద్దాలు పగల గొట్టారా !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. కాగా సోమవారం సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ను థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో థియేటర్స్ అన్నీ కూడా కోలాహలంగా మారాయి. మాములుగా పవన్ కళ్యాణ్ అభిమానులు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా విశాఖపట్నంలోని ఓ థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. తమ అభిమాన హీరో ట్రైలర్ ను చూసేందుకు అద్దాలు పగలగొట్టుకుని మరీ లోపలికి దూసుకెళ్లారు. అయితే ఈ క్రమంలో కొంతమంది గాయపడినట్లు కూడా తెలుస్తోంది. ఇది చూసినా నెటిజన్లు అభిమానం హద్దులు మీరకూడదంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement