Wednesday, May 1, 2024

అమెజాన్ ప్రైమ్ లో ఒక‌రోజు ముందుగా.. శాకుంత‌లం

మే 12 నుంచి శాకుంత‌లం సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారని అనుకున్నారు అంతా.. కాని చెప్పిన టైమ్ కంటే ముందే అంటే మే 11 ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు శాకుంతలం సినిమాను. శకుంతలగా స్టార్ హీరోయిన్ సమంత, దుశ్యంతుడిగా మలయాళ యంగ్ స్టార్ దేవ్ మోహన్. చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హా. ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు లా చాలామంది సీనియర్లు నటించి సినిమా శాకుంతలం. ఏప్రి14న రిలీజ్ అయిన ఈసినిమా మొదటి రోజు నుంచే నెగెటీవ్ టాక్ ను తెచ్చుకుంది. చాలా ఇబ్బందులు దాటుకుని గత నెలలో థియేటర్లలోకి వచ్చిన శాకుంతలం సినిమా… ఇప్పుడు నెలకూడా తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది శాకుంతలం. అయితే ముందుగా మేకర్స్ ప్రకటించాలి అనుకున్న డేట్ ప్రకారం కాకుండా.. ముందుగానే స్ట్రీమింగ్ అయ్యి.. అందరిని ఆశ్చర్యపరిచింది శాకుంతలం సినిమా.

Advertisement

తాజా వార్తలు

Advertisement