Saturday, October 5, 2024

Official | క‌ల్యాణ్‌రామ్ ‘డెవిల్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

విభిన్నమైన కథలతో మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు నందమూరి టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్. బింబిసార లాంటి బ్లాక్ బస్టర్ హిట్ త‌రువాత… అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నుంచి వస్తున్న లేటుస్ట్ మూవీ ‘‘డెవిల్’’. ఈ సినిమాలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించగా ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ తో పాటు.. ప్రతి చిన్న అప్డేట్ కూడా మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది.

అయితే మొద‌ట ఈ మూవీని న‌వంబ‌ర్ 24న విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేశారు.. అయితే కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేశారు. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మ‌ళ్లీ ప్ర‌క‌టించారు మేక‌ర్స్. ఈ సినిమాను డిసెంబ‌ర్ 29న పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement