Friday, May 3, 2024

‘భక్త కన్నప్ప’ నుంచి త‌ప్పుకున్న హీరోయిన్..

ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న‌ భారీ పాన్ ఇండియన్ మూవీ కన్నప్ప. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థల పై భారీ స్థాయిలో నిర్మితం కానున్న ఈ ప్రాజక్ట్ గ్రాండ్ లాంచ్ ఇటీవల జరిగింది. ఈ మూవీ లొ హీరోయిన్ గా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ ఎంపికైంది. అయితే, డేట్స్ అడ్జస్ట్ మెంట్ కారణంగా ఆమె మూవీ నుండి తప్పుకున్నారని, ఆమె రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ లు సొంతం చేసుకోవాలని కోరుతూ ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని త్వరలో అనౌన్స్ చేస్తాం అని తన మేక‌ర్స్ వెల్ల‌డించారు.

కాగా, ఈ మూవీలో ప్ర‌భాస్ కూడా కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై మేక‌ర్స్ నుండి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనుండ‌గా.. ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ క్రేజీ ప్రాజక్ట్ లో నటించనున్న నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు రాబోయే రోజుల్లో వెల్లడి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement