Saturday, April 13, 2024

NTR: దేవ‌ర‌లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం…

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర’. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్‌ లో కనిపిస్తారని ఇన్నాళ్లు టాక్ నడిచింది. ఐతే, తాజాగా ఇప్పుడు మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. ‘దేవర’లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు స‌మాచారం.

ఒకవేళ, ఎన్టీఆర్ మూడు పాత్రల వార్త నిజమైతే.. ఇది నిజంగా తారక్ అభిమానులకు ఈ సినిమా కనుల విందుగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయిక.

Advertisement

తాజా వార్తలు

Advertisement