Saturday, May 4, 2024

పాన్ ఇండియా ప్ర‌య‌త్నంలో నిఖిల్‌.. స్పై చేసి ద‌స‌రా ద‌డ‌ద‌డ‌లాడిస్త‌డ‌ట‌..

టాలీవుడ్ నుంచి మరో యంగ్ హీరో పాన్ ఇండియా రేంజ్ మూవీతో ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అయిపోయారు. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు నిఖిల్ సిద్ధార్థ్‌. ఆయ‌న హీరోగా గూఢ‌చారి, ఎవ‌రు, హిట్ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేసిన గ్యారీ బి.హెచ్ డైరెక్ష‌న్‌లో ఓ సినిమాను చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ‘స్పై’గా ఆదివారం అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్రం యూనిట్ విడుద‌ల చేసింది. ‘స్పై’ టైటిల్ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. బుల్లెట్స్ న‌డుమ హీరో నిఖిల్ స్టైలిష్ లుక్‌లో గ‌న్ చేత‌ప‌ట్టుకుని న‌డుచుకుంటూ వ‌స్తున్నారు.

ఈడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై రాజశేఖ‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ బ్యూటీ ఐశ్వ‌ర్య మీన‌న్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటున్న‌ ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్పై సినిమా రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంద‌ని మేక‌ర్స్ తెలిపారు.

అర్జున్ సుర‌వ‌రం సినిమా త‌ర్వాత నిఖిల్ హీరోగా న‌టించిన సినిమా ఏదీ విడుద‌ల కాలేదు. ఇప్ప‌టికే నిఖిల్ న‌టించిన 18 పేజీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మ‌రో వైపు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్ చేసిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కార్తికేయ 2 కూడా షూటింగ్‌ను జ‌రుపుకుంటోంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నిఖిల్ పాన్ ఇండియా ప్ర‌య‌త్నం చేయడం అనేది నిజంగా సాహ‌స‌మే అని చెప్పాలి. అయితే కంటెంట్‌పై న‌మ్మ‌కంతోనే ఆయ‌న పాన్ ఇండియా మూవీ చేయ‌డానికి రెడీ అయ్యార‌ని సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement