Wednesday, May 1, 2024

మహేష్ తో నయనతార రొమాన్స్ ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేక పోయినప్పటికీ తర్వాత జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ ను వెతికే పనిలో ఉన్నారట త్రివిక్రమ్.

అయితే మహేష్ సరసన ఈ సినిమాలో నయనతార ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కెరీర్ ను ఆరంభించి చాలా ఏళ్లు అవుతున్నా.. నయనతార ఒక్కసారి కూడా మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు కాంబినేషన్ అనగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని పరిశీలిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement