Sunday, May 5, 2024

Allari Naresh : నరేష్‌ కొత్త చిత్రం బచ్చల మల్లి

అల్లరి నరేష్‌ కొత్త చిత్రం ప్రారంభమైంది. సినిమాటైటిల్‌ ‘బచ్చల మల్లి’. సుబ్బు దర్శకుడు (సోలో బ్రతుకే సో బెటర్‌ ఫేమ్‌). సామజవరగమనా చిత్రాన్ని నిర్మించిన రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రానికి నిర్మాతలు. అల్లరి నరేష్‌కు ఇది 63వ సినిమా. టైటిల్‌ పోస్టర్‌లో పూర్తిగా లోడ్‌ చేయబడిన ట్రాక్టర్‌ లోయలో పడిపోతున్నట్టు కనిపిస్తోంది.

ట్రాక్టర్‌ పై టైటిల్‌ రాసి ఉంది.
బచ్చల మల్లి చిత్రం ప్రారంభోత్సవం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. తొలి సన్నివేశానికి ప్రతాప్‌ రెడ్డి కెమెరా స్విచాన్‌ చేశారు. దర్శకుడు అనిల్‌ రావి పూడి క్లాస్‌ ఇచ్చారు. విజయ్‌ కొనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1990 నేపథ్యంలో ఉండనుంది. అల్లరి నరేష్‌ జోడిగా అమృత అయ్యర్‌ నటిస్తోంది. ఇతర పాత్రల్లో కోట జయరామ్‌, రావు రమేష్‌, సాయి కుమార్‌, ధనరాజ్‌, హరితేజ తదితరులు నటిస్తున్నారు. విశాల్‌ చంద్ర శేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement