Sunday, April 28, 2024

Hi Nanna | శృతితో నాని స్టెప్పులు.. ”ఒడియమ్మ” సాంగ్ రిలీజ్

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘‘హాయ్ నాన్న’’. ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది. కాగా, ఇప్పటికే సినిమానుంచి వచ్చని టీజర్ & ట్రైలర్ తో… పాటలు అన్నీ కూడా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇదే క్రమంలో మరొక లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాని, శృతి హాసన్ జంటగా స్టెప్పులేసిన ‘‘ఒడియమ్మ’’ అనే మంచి పార్టీ వైబ్ ఉండే సాంగ్‌ని రిలీజ్ చేశారు.

YouTube video

- Advertisement -

ఇక సాంగ్ లో నాని స్టైలిష్ స్టెప్పులు అలాగే శృతి హాసన్ గ్లామర్ ట్రీట్ తో కిర్రాక్ అనిపించింది. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈసారి పార్టీ సాంగ్ తో మరింత కిక్ ఇచ్చాడు. ఇక అనంత శ్రీరామ్ క్యాచీ లిరిక్స్ రాయగా.. ఈ సాంగ్ కూడా సినిమాలో హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement