Sunday, May 5, 2024

OTTలో రిలీజ్​ కానున్న నాగార్జున అక్కినేని ‘ది ఘోస్ట్’..!

అక్కినేని నాగార్జున హీరోగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘ది ఘోస్ట్’. అయితే ఈ సినిమా డైరెక్ట్ OTT ప్లాట్‌ఫారమ్‌లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. మూవీలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవివర్మ, కాజల్ అగర్వాల్ తో పాటు శ్రీకాంత్ అయ్యంగార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్, OTT ప్లాట్‌ఫారమ్‌ను మేక‌ర్ప్ ఇంకా వెల్లడించలేదు. దీనికి సంబంధించిన వివరాలు త్వ‌ర‌లోనే విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement