Monday, April 29, 2024

నెట్‌ఫ్లిక్స్ లో “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.. ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న రోమ్-కామ్..

అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ”మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. కృష్ణాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ మూవీ రిలీజ్ కాగా.. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ వసూళ్లను రాబడుతూ 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అనుష్క, నవీన్ పోలిశెట్టి జంట కొత్తగా ఉండడం.. కామెడీ కూడా ఆడియెన్స్ ను అలరించడంతో ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను బాగా మెప్పించడంతో థియేటర్స్ లో బాగా అలరించింది.

ఏపీ, తెలంగాణ స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి విజయాన్ని సాధించన ఈ మూవీ ఇపుడు ఫైనల్ గా ఓటిటి డేట్ అయితే వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా.. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. అక్టోబర్ 5 నుండి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్టు తెలిపారు. మరి ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement