Wednesday, May 1, 2024

తమన్నా తో గని స్పెషల్ సాంగ్

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గని సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా… ఐటెం సాంగ్ చేస్తోందట.

త్వరలో ఈ పాటకు సంబంధించిన షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయబోతున్నారట. తమన్నా గతంలో కూడా చాలా ఐటమ్ సాంగ్స్ లో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement