Wednesday, May 1, 2024

సినిమాల్లోకి మెగాస్టార్ కూతురు..!

మెగా ఫ్యామిలీ నుంచి మరొకరు సినీ రంగ ప్రవేశం చేయనున్నారు. అందేంటి ఇప్ప‌టికే టాలీవుడ్‌లో సగం మంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి వ‌చ్చిన వారే కదా..మరీ ఇంకెవరు సినిమాల్లోకి రాబోతున్నారని ఆలోచిస్తున్నారా..? ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి వెండిత‌ర ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌బోతున్నది ఎవ‌రో కాదు చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత‌. ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్ గా చిరు, చరణ్ చిత్రాలకు వర్క్ చేశారు సుస్మిత‌. ఇప్పుడు వెండితెర‌పై త‌న అదృష్టం ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. ఈ మ‌ధ్య తన‌ భర్త విష్ణుతో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్’ స్థాపించిన సుస్మిత.. ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో వెబ్ సిరీస్ కూడా నిర్మించారు.

తమిళంలో మంచి పేరుతెచ్చుకున్న సినిమా 8 తొట్ట‌క‌ల్ ను తెలుగు రీమెక్ లో సుస్మత అరంగ్రేటం చేయనుందట. నాలుగేళ్ల క్రితం త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. క‌న్న‌డ‌లోను రీమేక్ కాగా, అక్క‌డ భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను ఇప్పటికే కొనుగోలు చేసిన సుస్మిత ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకుంటున్నారట‌. కేసు విచార‌ణ‌లో పోలీసు త‌న రివాల్వ‌ర్ పోగొట్టుకోగా ఇది ఎన్నో ప‌రిణామాల‌కు దారి తీస్తుంది. ఈ లైన్ తో స్టోరీ నడుస్తోందట. దీనిని తెలుగులో ఓ యువ హీరోతో చేయనుందట సుస్మిత.

Advertisement

తాజా వార్తలు

Advertisement