Monday, May 20, 2024

Mega prince : వ‌రుణ్ తేజ్.. లావ‌ణ్య త్రిపాఠీల ఎంగేజ్ మెంట్ కార్డ్

మెగా ఫ్యామిలీకి స‌న్నిహితుడు శివ‌చెర్రీ.. ఈయ‌న హీరో వ‌రుణ్ తేజ్..లావ‌ణ్య త్రిపాఠీల ఎంగేజ్‌మెంట్‌ను కన్ఫార్మ్‌ చేశాడు.
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అభిమాన సంఘానికి చెందిన శివ చెర్రీ.. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఇతను గురువారం వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠికి కంగ్రాట్స్‌ చెబుతూ ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ ఉన్న ఒక కార్డును పోస్ట్‌ చేశాడు. దీంతో ఇది కన్ఫార్మ్‌ అని మెగా ఫ్యాన్స్‌ ఫిక్సయిపోయారు. వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీళ్ల ఎంగేజ్‌మెంట్‌ గురించి ఇటీవల ఇండియా టుడే కూడా ఒక కథనం ప్రచురించింది. హైదరాబాద్‌లోని తమ నివాసంలో లేదా ఓ ఫంక్షన్‌ హాలులో వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే వీరి వివాహం కూడా ఉంటుందని పేర్కొంది.
రేపు జరగబోయే వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి,ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, రామ్‌ చరణ్‌, ఉపాసన, సాయిధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, సుష్మిత, శ్రీజ సహా కొణిదెల కుటుంబం అంతా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ కుటుంబం కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement