Friday, April 26, 2024

నాకు పెంపుడు కుక్కలు ఇష్టం – బాబు గోగినేని కాదు !! నాగబాబు ఫైర్

పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ను ఎవరు ఏమన్నా సరే అసలు ఊరుకోరు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కరోనా బారినపడ్డ నేపథ్యంలో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ లు, పూజలు కూడా చేస్తున్నారు. అయితే ఓ అభిమాని పవన్ కళ్యాణ్ బెడ్ పై పడుకున్న ఫోటోను పేపర్ బొమ్మని గీస్తూ పక్కనే చేగువేరా వివేకానంద ఫోటోలను కూడా వేశాడు. ఇక ఆ ఫోటో పై బాబు గోగినేని తనదైన శైలిలో సెటైర్ వేశారు.

ఈ ఫోటో కార్టూన్ లా ఉందంటూ కామెంట్ చేశాడు. ఇక దీని పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాబు గోగినేని పై మండిపడ్డారు. మరో అభిమాని బాబు గోగినేని చేసిన పోస్ట్ ని మెగా బ్రదర్ నాగబాబు కు ఫార్వర్డ్ చేశారు. దీనిపై స్పందించిన నాగబాబు నాకు ఇలాంటివి ఫార్వర్డ్ చేయకండయ్యా… నాకు కేవలం పెంపుడు కుక్కలు అంటే ఇష్టం. బాబు గోగినేని అంటే కాదు అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు.

https://www.facebook.com/watch/?v=755105645395622

https://m.facebook.com/story.php?story_fbid=4090472324348860&id=100001583978925

Advertisement

తాజా వార్తలు

Advertisement