Monday, April 29, 2024

25 వేల కుటుంబాలకు మంచు మనోజ్ సహాయం….హ్యాపీ బర్త్ డే మంచు మనోజ్

మంచు మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే పుట్టినరోజునాడు మంచు మనోజ్ అందరూ మెచ్చుకునేలా ఓ నిర్ణయం తీసుకున్నాడు. కరోనా సంక్షోభంలో ఉన్న 25 వేల కుటుంబాలకు సహాయం అందించడానికి ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం పుట్టిన రోజున కోవిడ్-19 వల్ల ప్రభావితమైన వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి నా వంతుగా సహాయం చేయాలి అనుకుంటున్నాను. ముందుగా మన ప్రాణాన్ని కాపాడడానికి వాళ్ల ప్రాణాలని, కుటుంబాన్ని పణంగా పెట్టి మనందరినీ కాపాడుతున్న ఫ్రంట్లైన్ వారియర్స్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సమయంలోనే మాస్కులు ధరించి, తరచూ శానిటైజ్ చేసుకుంటూ మన ప్రపంచాన్ని మనమే కాపాడుకోవాలి.

నా వంతుగా ఈ పుట్టిన రోజున నేను, నా అభిమానులు, మిత్రులు కలిసి ఈ కరోనా వల్ల ప్రభావితమైన 25 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందించి నా వంతు సహాయం చేస్తూ, ఇలాగే కొనసాగించాలి అనుకుంటున్నాను. ఈ కష్టమైన సమయంలో దయచేసి ఇంట్లో ఉండి మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకుందాం. స్టే హోమ్… స్టే హ్యాపీ… బీ పాజిటివ్ సదా నా ప్రేమతో మీ మంచు మనోజ్ అంటూ లేఖ ను విడుదల చేశారు మనోజ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement