Friday, May 3, 2024

మామామశ్చీంద్ర లో ఫ‌స్ట్ సింగిల్ …

సుధీర్‌బాబు’మామామశ్చీంద్ర’లో త్రిపాత్రా భినయంలో కనిపించనున్నారు. హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌ రావు నిర్మించారు. ఇటివలే విడుదల చేసిన ఈ చిత్రం టీ-జర్‌కి మంచి స్పందన వచ్చింది.
తాజాగా మొదటి సింగిల్‌ ”గాలుల్లోన…. ” లిరికల్‌ వీడియో విడుదల చేశారు. చైతన్‌ భరద్వాజ్‌ ఈ పాటని కంపోజ్‌ చేశారు. కృష్ణకాంత్‌ అందించిన సాహిత్యం అందించారు. కపిల్‌ కపిలన్‌, నూతన మోహన్‌ అలపించారు. ఈ పాటలో సుధీర్‌ బాబు దుర్గా, డిజే పాత్రలలో ఆకట్టు-కున్నారు. మిర్నాలిని రవి, ఈషా రెబ్బా బ్యూటీ-ఫుల్‌ గా కనిపించారు.
పిజి విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి రాజీవ్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సోనాలి నారంగ్‌, సృష్టి సమర్పిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement