Saturday, July 27, 2024

మ‌ల‌యాళ చిత్రం రీమేక్ లో – తండ్రి కొడుకుగా వెంక‌టేశ్ – రానా

త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాలు నేటివిటీకి ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. దాంతో ప‌లు చిత్రాలు తెలుగులోకి రీమేక్ అవుతుంటాయి. రీసెంట్ గా మ‌ల‌యాళంలో రిలీజ్ అయి హిట్ట‌యిన చిత్రం బ్రో డాడీ. ఈ చిత్రం టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత సురేశ్ బాబుకి న‌చ్చింద‌ట‌. దాంతో ఆయన ఈ సినిమాను హీరోలు వెంకటేశ్ – రానా ప్రధానమైన పాత్రలుగా రీమేక్ చేయాలనే నిర్ణయానికి వచ్చార‌ట‌. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ – పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. మోహన్ లాల్ సరసన మీనా .. పృథ్వీరాజ్ జోడీగా కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు.ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ నవ్విస్తూనే ఉంటుందట. అలా ఈ సినిమా రీమేక్ తో వెంకటేశ్ – రానా తండ్రీ కొడుకులుగా కనిపించనున్నార‌ట‌. మ‌రి వీరికి జోడీగా ఎవ‌రు న‌టించ‌నున్నారో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement