Wednesday, May 1, 2024

చెప్పిన డేట్ కే స‌లార్ .. క్లారిటీ ఇచ్చిన మేక‌ర్స్

స్టార్ హీరో ప్ర‌భాస్ ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు..ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో స‌లార్ ఒక‌టి. శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.ఈ మూవీ రిలీజ్ డేట్ పై మ‌రోసారి క్లారిటీ ఇచ్చారు మేక‌ర్స్. స‌లార్ మూవీని వచ్చే సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే సలార్‌ గురించి ఓ గాసిప్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా విడుదల ఆలస్యం కానుందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం సలార్ థియేటర్లలోకి వస్తుందా.. లేదా? అనే డైలామాలో స్టార్ హీరో ప్రభాస్‌ అభిమానులు పడిపోయారు. సలార్ రిలీజ్‌పై క్లారిటీ ఇవ్వాల్సిందిగా నెటిజన్లు, ఫ్యాన్స్ రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పుకార్లపై సలార్‌ టీం స్పష్టతనిచ్చింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం 2023 సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుందని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దని కోరింది. సలార్ షూటింగ్ ప్రస్తుత తుది దశలో ఉంది. కేజీఎఫ్‌ ప్రాంఛైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన విజయ్ కిరగందూర్‌ తన హోంబలే ఫిలిమ్స్ పై సలార్ ను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement