Wednesday, May 1, 2024

స్పీడ్ తగ్గని సూపర్ స్టార్ టీజర్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ సూపర్ స్టార్ అభిమానులనే… కాకుండా సినీ అభిమానులను సైతం ఆకట్టుకుంది.

కాగా విడుదలైన 24 గంటల్లోనే అదిరిపోయే వ్యూస్ తో రికార్డు సృష్టించింది. 25.7 మిలియన్ల వ్యూస్, 754 కే లైక్స్ తో టాలీవుడ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్ గా నిలిచింది. అయితే టీజర్ విడుదలైన నాలుగు రోజులు అవుతున్నా…ఇంకా అదే స్పీడ్ కంటిన్యూ చేస్తుంది. తాజాగా ఇప్పటివరకు ఈ టీజర్ కు 30+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ మేర చిత్ర యూనిట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement