Saturday, December 2, 2023

‘మాధవే మధుసూదన’ మూవీ సాంగ్ విడుద‌ల చేసిన బ్ర‌హ్మ‌నందం…

తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటిస్తున్న చిత్రం ‘మాధవే మధుసూదన’. బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాత. ఈ చిత్రం నుండి రెండవ లిరికల్‌ సాంగ్‌ను ప్రముఖ హస్యనటుడు బ్రహ్మనందం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం మాట్లాడుతూ ”మాధవే మధుసూదన సినిమా నుంచి సైయారా.. సైయారా.. సాంగ్‌ చూడడం జరిగింది. తేజ్‌ కొత్త కుర్రాడు అయినా చాలా ఈజ్‌ వుంది. డాన్స్‌ బాగా చేసాడు.” అన్నారు. దర్శక, నిర్మాత బొమ్మదేవర రామచంద్ర రావు మాట్లాడుతూ ”బ్రహ్మనందం గారు సైయారా.. సైయారా… రెండవ లిరికల్‌ సాంగ్‌ విడుదల చెయ్యటం చాలా ఆనందంగా వుంది. వైష్ణవి కొవ్వూరి పాడారు. వికాస్‌ బాడిస అందించిన సంగీతం మేజర్‌ హైలెట్‌. వాసు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్‌. ఉద్దవ్‌ ఎస్‌ బి ఈ సినిమాకు ఎడిటర్‌గా బాగా వర్క్‌ చేశారు. అని చెప్పారు.
ఈ చిత్రంలో తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే, జయ ప్రకాష్‌, సుమన్‌, రామచందర్‌, శైలజా ప్రియ, నవీన్‌ నేని, విజయ్‌ మాస్టర్‌ అంజలి, శ్రీలత తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement